చత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​

చత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​
  • మావోయిస్టు, జవాన్​ మృతి

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​ జరిగింది. సుక్మా-, బీజాపూర్​ జిల్లాల బార్డర్​లో గురువారం రెండు జిల్లాలకు చెందిన ఎస్టీఎఫ్, డీఆర్జీ, కోబ్రా బలగాలు జాయింట్​ ఆపరేషన్​ నిర్వహిస్తున్నండగా మావోయిస్టులు తారసపడ్డారు. బీజాపూర్​ జిల్లా పిడియా పోలీస్​స్టేషన్​ పరిధిలోని తుమ్రేల్​ అడవుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టుతోపాటు సుక్మా జిల్లాకు చెందిన కోబ్రా జవాన్​ గాయాలతో చనిపోయారు. బలగాలు తిరిగొచ్చాక పూర్తి వివరాలు చెప్తామని బీజాపూర్​ ఎస్పీ అన్నారు. కూంబింగ్​ ఇంకా కొనసాగుతున్నది.