ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి

సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్ నాయకులపై ఉందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అభినయ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు.

 అనంతరం వేణారెడ్డి మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ నాయకులకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం అప్పుల్లో నెట్టి ప్రజాధనాన్ని దోచుకుందని ఆరోపించారు. పదేండ్లలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో ప్రజలకు వివరించాలన్నారు. 

సూర్యాపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ,  యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్,  మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.