IPL మ్యానియా..రిసెప్షన్ లో జంటను పట్టించుకోలేదు

IPL మ్యానియా..రిసెప్షన్ లో జంటను పట్టించుకోలేదు

పెళ్లంటే ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఎంత ఖర్చయినా అందరికీ గుర్తుండిపోయేలా  చేయాలనుకుంటారు. ఎందుకంటే పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అందుకే భారీగా ఖర్చు చేసి  గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసింది  ఓ న్యూ కపుల్.  రిసెప్షన్ కు చాలా మంది వచ్చారు ఫంక్షన్ స్టాట్ అయ్యింది.  కానీ ఆ న్యూ కపూల్ కు వచ్చిన అతిధులు ఒక్క సారిగా షాకిచ్చారు.  దీంతో చాలా డిస్సాపాయింట్ అయ్యారు ఆ నూతన వధూవరులు. ఎందుకంటే అదే రోజును ఐపీఎల్ 12 ఫైనల్ మ్యాచ్.

హైదరాబాద్ లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అదే రోజు ఓ రిసెప్షన్ జరుగుతుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కావడంతో వచ్చిన అథిదుల కోసం  రిసెప్షన్ స్టేజ్ పక్కన ఓ ఎల్ ఈడీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. మ్యాచ్ ఇంట్రెస్ట్ గా జరగుతుండటంతో వచ్చిన వారు ఆ కపుల్ ను పట్టించుకోకుండా క్రికెట్ లో లీనమయ్యారు.  సిక్స్లులు, ఫోర్లు కొట్టినప్పుడు, వికెట్ పడినప్పుడు విజిలేస్తూ కేకలు వేస్తూ గోల గోల చేస్తున్నారు తప్ప ఆ జంట వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో స్టేజ్ పైన ఉన్న  జంట బిక్క మొహం వేసుకోవాల్సిన పరిస్థితి.  ఇంత ఖర్చు పెట్టి రిసెప్షన్ ఏర్పాటు చేస్తే  వచ్చిన అథిదులు క్రికెట్ చూడటమేంటని డిస్సాపాయింట్ అయ్యారు.