బిల్డింగ్ పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

బిల్డింగ్ పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

భర్త వేధింపులు తట్టుకోలేక ఓ గృహిణి అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్ బీ పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపేట్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి చిప్పడ పాండురంగ రెండో కుమార్తె మేఘన(30)ను హైదర్ నగర్ కు చెందిన కొత్తపల్లి వినయ్ కుమార్ కు ఇచ్చి2017లో ఘనంగా వివాహం జరిపించాడు. 6 నెలలు వీరి కాపురం సజావుగా సాగింది. అప్పటి నుంచి మేఘనను భర్త, అత్తింటి వారు వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. మేఘనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేయడంతో పాటు విడాకులు కావాలని టార్చర్ పెట్టేవారు. ఈ నెల 4 వ తేదీన మేఘనకు తన భర్త నుంచి లీగల్ నోటీసులు రావడంతో మానసికంగా కుంగిపోయింది. దీంతో శుక్రవారం హైదర్ నగర్ లోని భర్త ఉంటు న్న భవ్యాస్ అఖిల ఎక్సోటిక్ అపార్ట్ మెంట్ కు చేరుకుంది. సాయంత్రం 3.35గంటలకు అపార్ట్ మెంట్  పై తొమ్మిదో అంతస్థు నుండి కిందకు దూకి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో మేఘన తండ్రి ఫిర్యాదు మేరకు కేపీహెచ్ బీ పోలీసులు మేఘన భర్త, మామపై కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.