 
                                    మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల కోసం ఏకం కావాల్సిన అవసరం ఉందని ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ నాగన్ కుమారస్వామి అన్నారు. గురువారం పీయూలో బీసీ రిజర్వేషన్లపై సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం విధి విధానాలు రూపొందించారని చెప్పారు. పీయూ లా కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ వంగర భూమయ్య, శాంతి ప్రియ, గాలెన్న, బత్తుల రవీందర్ గౌడ్, ఎం శ్రీనివాసులు, రాఘవేందర్ గౌడ్, నాగరాజు పాల్గొన్నారు.

 
         
                     
                     
                    