పెళ్లితో సంబంధం లేకుండా పిల్లల్ని కనండి.. వీకే నరేష్ సెన్సేషనల్ కామెంట్స్!

పెళ్లితో సంబంధం లేకుండా పిల్లల్ని కనండి.. వీకే నరేష్ సెన్సేషనల్ కామెంట్స్!

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. పెళ్లిళ్లు, సహజీవనం, నేటి తరం యువత ఆలోచన విధానంపై ఆయన చేసిన వ్యా్ఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్,  వి.కె. నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ వినోదాత్మక చిత్రం 'క్రేజీ కళ్యాణం'. ఈ సినిమా ఈవెంట్ లో ప్రస్తుత సమాజంలో పెళ్లి చేసుకోవడం కరెక్టా? రాంగ్ ఆ? అనే ప్రశ్న నరేష్‌కు ఎదురైంది.

దీనికి ఆయన స్పందిస్తూ.. ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా కరెక్టే. లివింగ్ టుగెదర్ కూడా లీగల్ అయిపోయింది. నేడు పెళ్లి అనేది ఒక పెద్ద ఈవెంట్‌గా మారి, ఆ తర్వాత విడాకుల కోసం కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్ల కోసం యువకులు అల్లాడిపోతున్నారు. అయితే ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఫర్వాలేదండి.. కానీ పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా కనండి.. అంటూ వినూత్న సలహా ఇచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఈ సినిమాలో అనుపమ తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుండగా, నరేష్ ఆమె తండ్రి పాత్రలో నటిస్తున్నారు. అమెరికా సంబంధం తేవాలనుకునే తండ్రికి, తన ప్రేమనే గెలిపించుకోవాలని చూసే కూతురికి మధ్య జరిగే హాస్య భరిత పోరాటమే ఈ చిత్ర కథాంశం. కుటుంబ అనుబంధాలు, యూత్‌ఫుల్ లవ్ అండ్ ఫన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలో సందడి చేయనుంది. నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో, సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి..