Victoris: మారుతీ సుజుకీ నుంచి విక్టోరిస్ లాంచ్.. పూర్తి ఫీచర్స్ తెలుసుకోండి..

Victoris: మారుతీ సుజుకీ నుంచి విక్టోరిస్ లాంచ్.. పూర్తి ఫీచర్స్ తెలుసుకోండి..

మారుతి సుజుకి కొత్తగా విడుదల చేసిన Victoris అనే మిడ్‌సైజ్ SUV‌గా గ్రాండ్ వితారా తర్వాత మార్కెట్లోకి వచ్చింది. ఇది మార్కెట్‌లో ఉన్న ప్రధాన SUVలతో పోటీ పడేందుకు తీసుకురాబడింది. మారుతి సుజుకిలో డాల్బి అట్మోస్ ఆడియో సిస్టమ్ కలిగిన తొలి కారుగా ఉండనుంది. అలాగే Level-2 ADASతో వస్తోంది.

Victoris CNG వేరియంట్ అందుబాటులో ఉంది. దీనిలో ప్రత్యేకంగా సీఎన్జీ ట్యాంక్ కారు కింది భాగంలో అమర్చబడింది. ఇది కారు వెనక భాగంలో ఉన్న సిలిండర్‌లకు భిన్నంగా వాహన బూట్ స్పేస్‌ను పెంచటానికి రూపొందించబడింది. కారులో పవర్డ్ టేల్గేట్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, పవర్డ్ డ్రైవర్ సీటు, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 64-కలర్ అంబియంట్ లైటింగ్, PM 2.5 ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, పానోరామిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ALSO READ : జీఎస్టీ ఆదాయంపై కేంద్రానికి రాష్ట్రాల ప్రశ్నలు..

కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC, ABS తో EBD, హిల్ హోల్డ్ అసిస్టెంట్, సీట్బెల్ట్స్ రిమైండర్ వంటి భద్రతా ఫీచర్లు కూడా అందించబడ్డాయి. టాప్ వేరియంట్లలో 360 డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే కూడా వస్తున్నాయి.  భారత NCAPలో 5-స్టార్ రేటింగ్ అందుకుని సురక్షితమైన కారుగా నిలిచింది. కంపెనీ కార్లను Arena షోరూంలలో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. కంపెనీ ఈ మోడల్ కార్లను ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తోంది.