ఏంటి భయ్యా ఈ మారుతీ కారుకు ఇంత క్రేజ్.. 25వేల బుక్కింగ్స్, వెయిటింగ్ 10 వారాలు అంట..!

ఏంటి భయ్యా ఈ మారుతీ కారుకు ఇంత క్రేజ్.. 25వేల బుక్కింగ్స్, వెయిటింగ్ 10 వారాలు అంట..!

గడచిన 10 రోజులుగా దేశంలో కార్ల వ్యాపారం ఎవ్వరి ఊహలకూ అందనంత స్పీడుగా జరుగుతోంది. జీఎస్టీ తగ్గింపుతో కంపెనీలు రేట్లు తగ్గించటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. పండగ అయిపోగానే మళ్లీ కంపెనీలు చిన్నగా రేట్లు పెంచేస్తాయనే భయాలు కూడా ఆటో లవర్స్ ని వెంటాడటంతో దసరా, దీపావళికి ఆలస్యం చేయకుండా నచ్చిన కారు కొనేసుకుంటున్నారు. 

ఈ పండుగ సేల్ సమయంలో రికార్డులు బద్ధలు కొడుతోంది మాత్రం మారుతీ కంపెనీ అనే చెప్పుకోవాలి. అవును లక్షల కార్లను బజ్జీలు బోండాల్లా అమ్ముడు కావటం ప్రజలు ఎగబడి మరీ మారుతీ కార్లపై పడటం కంపెనీనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో లాజిస్టిక్స్ ఆలస్యాలు ఏర్పడి లక్షల కార్లు డీలర్ల వద్దకు బయలుదేరాయి. ఈ క్రమంలో మారుతీ సుజుకీకి చెందిన విక్టోరిస్ కార్లు సడెన్ గా భారీ డిమాండ్ చూస్తున్నాయి. అవును ప్రస్తుతం 25వేల కార్ల బుక్కింగ్స్ జరిగినట్లు వెల్లడైంది. వాస్తవానికి కంపెనీ తన బ్రెజా గ్రాడ్ వితారాల మధ్య రేంజ్ లో విక్రయిస్తోంది. 

మారుతీ విక్టోరిస్ మార్కెట్లోకి హ్యుందాయ్ క్రియా, కియా సెల్టోస్ వంటి మోడళ్లతో పోటీ పడుతున్న ఎస్ యూవీ. ప్రస్తుతం దీనికి బుక్కింగ్స్ అమాంతం పెరగటంతో వెయిటింగ్ పిరియడ్ 10 వారాలకు పెరిగింది. మోడల్, కలర్, వేరియంట్, ఫీచర్స్ ఆధారంగా ఈ వెయిటింగ్ మారుతోందని కంపెనీ చెబుతోంది. పైగా ఈ ఎస్ యూవీలో మూడు ఇంజన్ వేరియంట్లు, మూడు ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో 6 ప్రధాన వేరియంట్లు ఉన్నాయి. పైగా వీటికి 10 వివిధ రంగుల్లో విక్రయిస్తోంది మారుతీ. 

ALSO READ : రోజూ మీరు బయట టిఫిన్ చేయగలిగితే పేదోళ్లు కారంట భయ్యా..!

మారుతీ ఈ కార్లను తన ఎరినా షోరూంలలో విక్రయిస్తోంది. ఈ కార్ల రేటు స్టార్టింగ్ రూ.10లక్షల 50వేల నుంచి గరిష్ఠంగా రూ.19లక్షల 99వేల వరకు ఫీచర్స్, మోడల్ ఆధారంగా మారుతున్నాయి. ఇక ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ విషయానికి వస్తే లీటరుకు 19 కిలోమీటర్ల నుంచి అత్యధికంగా 28.65 కిలోమీటర్ల వరకు ఇంజిన్, టెక్నాలజీ ఆధారంగా అందిస్తోంది కారు. ఈ కార్లలో K15C ఇంజిన్లను కంపెనీ ఏర్పాటు చేసింది.