మాస్క్​లు, శానిటైజర్లు బ్లాక్​ చేస్తే జైలుకే

మాస్క్​లు, శానిటైజర్లు బ్లాక్​ చేస్తే జైలుకే

డిమాండ్​ అండ్​ సప్లయి థియరీ ప్రకారం ఇప్పుడు మాస్క్​లు, శానిటైజర్లపై బ్లాక్​ మార్కెటీర్లు పడ్డారు. డిమాండ్​ బాగా ఉన్నప్పుడు తయారీని కంట్రోల్​ చేయడం, సరుకును దాచిపెట్టి ఎంఆర్పీ కంటే ఎక్కువకు అమ్ముకోవడం జరుగుతోంది. కరోనా వైరస్​ అంటుకోకుండా ఉండాలంటే మాస్క్​లు వేసుకుని, చేతులు ఒకటికి నాలుగుసార్లు కడుక్కోవాలి. అందుకే, ఈ వస్తువులను ఎసెన్షియల్​ కమోడిటీస్​ యాక్ట్​ కిందకు తెచ్చింది మోడీ సర్కారు. మాస్క్​లు, శానిటైజర్లు జనాలకు అంద కుండా దాచిపెడితే జైలుకు పంపుతారు.

ఎసెన్షియల్​ కమోడిటీస్​ లిస్టులోకి ఏవైనా వస్తువులు, సర్వీసులు చేర్చినట్లయితే… అవి ప్రజలకోసం ఎలాంటి ఆటంకం లేకుండా అందుబాటులో ఉండాల్సిందే. ప్రపంచమంతా కొవిడ్​–19 (కరోనా) వైరస్​తో వణుకుతున్న నేపథ్యంలో… ఇప్పుడా లిస్టులోకి ముఖానికి పెట్టుకునే మాస్క్​లు, చేతులు శుభ్రపరచుకునే శానిటైజర్లు వంటివి చేర్చారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించడం కరోనా వైరస్​కున్న మొదటి లక్షణం. అందువల్లనే పెద్ద సంఖ్యలో జనం కలుసుకుంటారనుకున్న ప్రతి కార్యక్రమాన్నీ ఎక్కడికక్కడ ప్రభుత్వాలు కంట్రోల్​ చేస్తున్నాయి. సినిమా హాళ్లు, డ్రామా థియేటర్లు, పబ్లిక్​ ఫంక్షన్లు, మ్యూజిక్​ ఫెస్టివల్స్​ అన్నీ బంద్. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు, రవీంద్రభారతి లాంటి ఆడిటోరియంలు మూసేశారు. చాలాచోట్ల పెళ్లిళ్లు నిలిచిపోయాయి. ఆంధ్రపదేశ్​లో లోకల్​ బాడీ ఎలక్షన్లు వాయిదా వేసేశారు. మరోవైపు ప్రజలకు మాస్క్​లు దొరకడం లేదని, శానిటైజర్లను ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని వార్తలు వినొస్తున్నాయి.

ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఎసెన్షియల్​ కమోడిటీస్​ యాక్ట్​ని ప్రయోగించాల్సి వచ్చింది. 2 ప్లై, 3 ప్లై, ఎన్​95 రకం మాస్క్​లు, హేండ్​ శానిటైజర్లను వచ్చే జూన్​ 30వ తేదీ వరకు అత్యవసర సరుకుల జాబితాలోకి చేర్చింది. 1955 నాటి ఎసెన్షియల్​ కమోడిటీస్​ యాక్ట్​ ప్రకారం… వస్తువుల ఉత్పత్తి, సప్లయి, పంపిణీలు, వాటి వ్యాపారం వంటివన్నీ ప్రజల ప్రయోజనాలకోసమే కేటాయించాలి. ఏవైనా సరుకులకు షార్టేజీ ఏర్పడినప్పుడు వాటిని బ్లాక్​ చేయడం, ఎక్కువ ధరలకు అమ్ముకోవడం లాంటివి జరగకుండా ఈ యాక్ట్​ నిషేధిస్తుంది. కరోనా వైరస్​ కేసులు పెరుగుతున్నందున మాస్క్​లకు, శానిటైజర్లకు ఇండియా సహా ప్రపంచ దేశాలన్నిచోట్ల కొరత ఏర్పడింది. ఈ తాజా ఆర్డర్​తో ఎసెన్షియల్​ కమోడిటీగా ప్రకటించిన వస్తువులకు రిటైల్​ ధరనుకూడా ప్రభుత్వమే ఫిక్స్​ చేస్తుంది.

సమస్య చల్లారగానే తీసేస్తారు

కొవిడ్​–19 వైరస్​ వ్యాప్తి కాకుండా అడ్డుకోవడంలో భాగంగానే మాస్క్​లు, శానిటైజర్లను ఎసెన్షియల్​గా ప్రకటించింది తప్ప, ఇవి రోజువారీ వినియోగానికి సంబంధించింది కాదని చెప్పవచ్చు. జూన్​ 30 వరకు మాత్రమే వీటిని ఎసెన్షియల్​గా చూస్తారు. కరోనా వైరస్​ సోకినవారు, లేదా అలాంటి లక్షణాలు కలిగినవారికి దగ్గరగా ఉండేవారు తప్పనిసరిగా మాస్క్​లు పెట్టుకోవాలని డాక్టర్లు, హెల్త్​ ఎక్స్​పర్ట్​లు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దానిని కంట్రోల్​ చేయడంకోసం కొన్ని చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే మాస్క్​ల్ని, శానిటైజర్లను ఎసెన్షియల్​ లిస్టులో చేర్చింది. ఆ సమస్య తీరగానే వాటిని లిస్టు నుంచి తీసేస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఈ లిస్టులో వివిధ రకాల లైఫ్​సేవింగ్​ డ్రగ్స్​, ఎరువులు, చిరుధాన్యాలు, ఆహారధాన్యాలు, చక్కెర, వంటనూనెలు, పెట్రోలియం, పెట్రో ఉత్పత్తులు, కొన్ని రకాల పంటలు ఉన్నాయి. వీటిని అత్యవసర జాబితాలో కంటిన్యూ చేస్తోంది. మాన్యుఫాక్చర్​ చేసేవారు, హోల్​సేల్​, రిటైల్​ వ్యాపారులు, దిగుమతిదారులు ఆయా వస్తువులను భారీ సంఖ్యలో నిల్వ చేసుకోవడం, జనాలకు అందుబాటులో లేకుండా చేయడం, బ్లాక్​లో అమ్ముకోవడం వగైరాలకు పాల్పడితే కాగ్నిజబుల్​ అఫెన్స్​గా పరిగణిస్తారు. జరిమానాలు వేయడమేకాక, ఒక్కోసారి కేసును బట్టి ఏడేళ్ల జైలు శిక్షకూడా పడుతుంది. అత్యవసర వస్తువులు దొరక్కుండా చేస్తున్నారని అనుమానమొస్తే… బ్లాక్ మార్కెటీర్లపై రాష్ట్ర ప్రభుత్వాలు, యూనియన్​ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్​కి దాడులు చేసే అధికారాలుంటాయి.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలోకి కవిత