సర్కారు బడిలో సామూహిక అక్షరాభ్యాసం

సర్కారు బడిలో సామూహిక అక్షరాభ్యాసం

చండ్రుగొండ, వెలుగు:  చండ్రుగొండ మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్ల హాజరుశాతం పెంచాలని ఎంఈవో సత్యనారాయణ టీచర్లను ఆదేశించారు. పోకలగూడెం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఒకటో తరగతిలో చేరిన స్టూడెంట్లకు సామూహికంగా అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్లు తప్పక సమయపాలన పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తొలిమెట్టు మండల నోడల్ ఆఫీసర్ సత్యనారాయణ, ఇన్ చార్జి హెచ్ఎం వెంకటరమణ, ఎస్ఎంఎస్ చైర్మన్ తులశమ్మ, టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.