కాంగ్రెస్​లో భారీగా చేరికలు

కాంగ్రెస్​లో భారీగా చేరికలు

రాజాపేట, వెలుగు : కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం మండల కేంద్రంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. 

పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్​ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత, కొత్త అనే భేదం లేకుండా కార్యకర్తలు అందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రజా పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్​లో చేరుతున్నట్లు తెలిపారు. అనంతరం బొందుగుల గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రైస్ లవ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బియ్యాన్ని పంపిణీ చేసి నూతన చర్చి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పార్టీలో చేరినవారిలో మదర్ డైయిరీ డైరెక్టర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొల్లపల్లి రామ్ రెడ్డి, భానుప్రకాశ్ గౌడ్, ప్రవీణ్, కనకరాజు, గాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.  

 

  • ఎమ్మెల్యేను కలిసిన పూర్వ వీఆర్వోలు..

యాదగిరిగుట్ట, వెలుగు : రెవెన్యూ నుంచి వేరే డిపార్ట్​మెంట్లలో సెటిల్ చేసిన తమను తిరిగి రెవెన్యూ శాఖ పరిధిలోకి తీసుకోవాలని పూర్వ వీఆర్వోలు కోరారు. ఈ మేరకు శనివారం యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో ఐలయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి అందులో పనిచేస్తున్న ఉద్యోగులను వేరే డిపార్ట్​మెంట్లలోకి పంపించడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, 

అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పూర్వ వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, జిల్లా కోశాధికారి శ్రీనివాస్, పూర్వ వీఆర్వోలు వెంకటనరసింహారెడ్డి, చారి, కృష్ణ, రాజయ్య, యాదగిరి, రమేశ్, ఇస్తారి, ఉపేందర్, పాషా, జహంగీర్ తదితరులు ఉన్నారు.