రూ.200 కోట్ల స్కామ్‌‌‌‌లో యాక్సిస్ ఫండ్ మేనేజర్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌

రూ.200 కోట్ల స్కామ్‌‌‌‌లో యాక్సిస్ ఫండ్ మేనేజర్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌

 

  •     విరేష్ జోషిని ఈ నెల 8 వరకు 
  • ఈడీ కస్టడికి పంపిన కోర్ట్‌‌‌‌


న్యూఢిల్లీ: ఫ్రంట్ రన్నింగ్ మోసానికి పాల్పడి, ఆ డబ్బులను డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు పంపారనే ఆరోపణలపై  మాజీ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ట్రేడర్,  ఫండ్ మేనేజర్‌‌‌‌ విరేష్ జోషిని ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం అరెస్ట్ చేసింది. మ్యూచువల్ ఫండ్స్  తీసుకునే నిర్ణయాలను ట్రేడర్లు లేదా ఫండ్‌‌‌‌ మేనేజర్లకు ముందుగానే తెలుస్తుంది. ఈ వివరాల ఆధారంగా వీరు తమ సొంత అకౌంట్ల ద్వారా  అక్రమంగా లాభాలను సంపాదించడాన్ని ఫ్రంట్ రన్నింగ్ స్కామ్‌‌‌‌ అంటారు. 

విరేష్ జోషి రూ.200 కోట్ల స్కామ్‌‌‌‌ చేశాడని ఈడీ ఆరోపిస్తోంది. పీఎంఎల్‌‌‌‌ఏ  కోర్టు జోషిని ఆగస్టు 8 వరకు ఈడీ కస్టడీకి పంపింది. జోషి 2018–-2021 మధ్య యాక్సిస్ ఎంఎఫ్‌‌ ట్రేడ్‌‌‌‌ల సమాచారాన్ని దుర్వినియోగం చేసి, దుబాయ్ టెర్మినల్ ద్వారా డొల్ల ఖాతాలతో ట్రేడ్‌‌‌‌లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతర ట్రేడర్లు/బ్రోకర్లు కూడా ఈ కుంభకోణంలో పాల్గొన్నారని ఈడీ తెలిపింది.