V6 News

అంబర్ పెట్ లో భారీ అగ్నిప్రమాదం... మహీంద్రా సర్వీసింగ్ సెంటర్ గోదాంలో మంటలు...

అంబర్ పెట్ లో భారీ అగ్నిప్రమాదం... మహీంద్రా సర్వీసింగ్ సెంటర్ గోదాంలో మంటలు...

అంబర్ పెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెనాల్ట్, మహీంద్రా సర్వీసింగ్ సెంటర్ గోదాంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సోమవారం ( ఏప్రిల్ 27 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. అంబర్ పెట్ 6వ నంబర్ చౌరస్తాలోని రెనాల్ట్ షోరూం,మహీంద్రా షోరూంలలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగ పరిసరాలను కమ్మేసింది. ఈ ఘటనలో గోదాంలోని సామాగ్రి కాలి బూడిదయ్యింది.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండచ్చని భావిస్తున్నారు. ఘటనపై సంచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెస్తున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండచ్చని అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.