పెర్ఫ్యూమ్ (సెంటు) కంపెనీలో అగ్నిప్రమాదం

పెర్ఫ్యూమ్ (సెంటు) కంపెనీలో అగ్నిప్రమాదం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోలన్ జిల్లాలోని బడ్డీ ప్రాంతంలో ఫెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో శుక్రవారం (ఫిబ్రవరి 2) న ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించంతో భారగా పొగ, మంటలు ఎగిసిపడ్డాయి. ఎన్డీఆర్ ఎఫ్,అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో 19 మంది గాయాపడ్డారు. ఇప్పటివరకు ప్రమాదం నుంచి 41 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.