
సూర్యాపేట జిల్లా: సూర్యాపేటలో భారీగా బంగారం దోపిడీ జరిగింది. గోడకు రంధ్రం వేసి లోపలికి వెళ్లి18 కేజీల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. సూర్యాపేట పట్టణంలోని సాయి సంతోషి జువెల్లర్స్లో ఈ ఘటన జరిగింది. షాపు వెనుక భాగం నుండి ఓ వైపు గోడకు రంధ్రం, మరోవైపు వెనుక షట్లర్ ధ్వంసం చేసి దోపిడీ ముఠా బంగారం దోచుకుని పరారైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో దొంగలు ఈ మధ్య రెచ్చిపోతున్నారు. ఇంటికి తాళం కనిపించిందంటే చాలు.. దొంగలు తమ చేతికి పని చెబుతున్నారు. ఉదయం టైంలో రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో గుట్టుగా తమ పని కానిచ్చేస్తున్నారు. ఇక కొందరైతే పట్టపగలే ఇండ్లలోకి చొరబడి అందినకాడికి ఎత్తుకెళ్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏటీఎంలో చోరీ ఘటన గుర్తుండే ఉంటుంది.
Also Read:-ట్విస్టు మీద ట్విస్టులు.. ఒకరి హత్యకు సుపారీ.. మరొకరిపై హత్యాయత్నం.. చివరికి
ఫార్చునర్కారులో వచ్చిన ఇద్దరు దొంగలు గ్యాస్ కట్టర్తో కట్‌చేసి ఏటీఎంలో డబ్బులు ఎత్తుకెళ్లారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లింగగిరి రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు శనివారం అర్ధరాత్రి ఏటీఎంలోకి ఓ దొంగ వెళ్లి గ్యాస్ కట్టర్ తో కట్ చేస్తుండగా, మరో దొంగ షటర్ ను కిందకు దించి పరిసరాలను గమనించడం సీసీ కెమెరాలో రికార్డు అయింది. పక్కా ప్లాన్ తో 15 నిమిషాల్లో ఏటీఎంను కట్ చేసి, అందులోని మనీ బాక్సులను బయటకు తీసుకొచ్చారు. నగదును బయటకు తీసుకురాగానే షటర్ మూసివేసి ఏటీఎం రూమ్‌ను తగలబెట్టి దుండగులు పరారయ్యారు. ఏటీఎంలో 2 రోజుల కింద రూ.20 లక్షలు పెట్టగా, ఆ డబ్బులన్నీ ఎత్తుకెళ్లారు. ఇలా వరుస చోరీ ఘటనలతో సూర్యాపేట జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.