కుత్బుల్లాపూర్లో చోరీ.. 10 తులాల బంగారు, రూ.7లక్షలు అపహరణ

కుత్బుల్లాపూర్లో చోరీ.. 10 తులాల బంగారు, రూ.7లక్షలు అపహరణ

కుత్బుల్లాపూర్ లోని ఓ ఇంటో భారీ చోరీ జరిగింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ శివ నగర్ లో నివాసముంటున్న సాప్ట్ వేర్ ఉద్యోగి మనోహర్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. మనోహర్ కుటుంబం బహదూర్ పల్లిలో కొత్తగా నిర్మించుకున్న ఇంటి(విల్లా)లో గృహ ప్రవేశం చేసుకున్నారు, అలస్యం అవడంతో మంగళవారం రాత్రి అక్కడే వారు బస చేశారు.

అయితే శివ నగర్ లోనీ ఇంటికి తాళం వేసి ఉందని గమనించిన దొంగలు, తాళం పగలకొట్టి ఇంట్లో ఉన్న 10తులాల బంగారం, 7లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. నిన్న ఇంటికి వచ్చిన చూడగా ఇంట్లో సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉండటంతో జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.