డబ్బు, మద్యం పంచకుండా ఓట్లు అడిగే దమ్ము సండ్రకు ఉందా : మట్టా దయానంద్

డబ్బు, మద్యం పంచకుండా  ఓట్లు అడిగే దమ్ము సండ్రకు ఉందా : మట్టా దయానంద్

కల్లూరు, వెలుగు  :   సత్తుపల్లి నియోజకవర్గంలో డబ్బు, మద్యం పంచకుండా ప్రజలను ఓట్లు అడిగే దమ్ము కాంగ్రెస్​కు ఉంది.. ఆ దమ్ము ఎమ్మెల్యే సండ్రకు ఉందా అని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ ప్రశ్నించారు. శుక్రవారం కల్లూరు మండలం పడమర లోకవరంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్​ ఆరు గ్యారంటీల పాంప్లేట్స్​ను పంచారు. పూజారి ఎలమంచిలి కృష్ణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

నాయకులు కళ్యాణపు వెంకటేశ్వరరావు, ఎర్కారెడ్డి వెంకటరెడ్డి, పుచ్చకాయల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామంలోని పలు కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరాయి. అనంతరం మట్టా దయానంద్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ నేతల అనుచరులకే ఇస్తున్నారని, సామాన్యులకు చేసిందేమీ లేదన్నారు. గొర్రెల యూనిట్ల కోసం గొల్ల,కుర్మలు అప్పులు చేసి డీడీలు కట్టి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ యూనిట్లు మంజూరు చేయలేదన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సత్తుపల్లి జిల్లా కావాలని మాట్లాడిన సండ్ర వెంకటవీరయ్య అధికారపక్షంలో చేరిన తర్వాత ఆ విషయంపై ఎందుకు సైలెంట్​ అయ్యారని నిలదీశారు. మాయమాటలు చెబుతున్న బీఆర్​ఎస్​ను ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దని ప్రజలకు సూచించారు.  కార్య్రమంలో నాయకులు మాదిరాజు అన్నం రాజు, బూదాటినారపరెడ్డి, కత్తి కృష్ణారెడ్డి , కొర్ర నరసింహారావు , పాప బత్తిని నగేశ్, దేవరపల్లి వెంకటేశ్వర్లు, భాగం ప్రభాకర్ చౌదరి, మూకర విజయరావు, కేవీఆర్​చౌదరి, భూక్య శివకుమార్ నాయక్, ఏనుగు సత్యంబాబు, జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు  నారాయణవరపు శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు  వర్ధ బోయిన  పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.