విద్వేషపూరిత ప్రసంగం..ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు శిక్ష

విద్వేషపూరిత ప్రసంగం..ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు శిక్ష

లక్నో: విద్వేష రగిల్చే ప్రసంంగా కేసులో  ఎమ్మెల్యేకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు మౌ యూపీలోని మౌ సదర్​ ఎమ్మెల్యే అబ్సాస్​ అన్సారీ, మన్సూర్ అన్సారీలను శనివారం (మే31) /ఉత్తరప్రదేశ్​ ఎంపీ/ ఎమ్మెల్యే కోర్టు దోషులుగా తేల్చింది. ఎమ్మెల్యే అబ్బాస్​కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అబ్బాస్​ గ్యాంగ్​ స్టర్ ముక్తార్​ అన్సారీ కుమారుడు. అబ్బాస్​ కు జైలు శిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధించింది.మరో నిందితుడు మన్సూర్​ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

ఏంటా విద్వేషపూరిత ప్రసంగం..

2022 మార్చిలో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అబ్బాస్​ అన్సారి హిసాబ్​ కితాబ్​ ప్రసంగం సోషల్​ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ ప్రసంగంలో అబ్బాస్​ ఓ వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అధికారులను బెదిరింపు కేసులు నమోదు చేశారు. 

పహార్​ గడ్​లో ఎన్నికల ప్రచారంలో అబ్బాస్​ అన్సారీ ప్రభుత్వ అధికారులను బెదిరించినట్టు పోలీసులు ఆరోపణలున్నాయి. ఎస్పీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల బదిలీకి ముందు గత పాలనలో వారు చేసిన పనికి హిసాబ్​ కితాబ్​ ఇవ్వాల్సి ఉంటుందని మౌ సదర్​ ఎంపీ అబ్బాస్​ అన్సారీ బెదిరించారని ఆరోపణలున్నాయి.  

ALSO READ | ఇక మాటల్లేవ్.. బుల్లెట్లతోనే సమాధానం: పాక్‎కు ప్రధాని మోడీ మాస్ వార్నింగ్

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత అధికారులను వారితో ఖాతాలు పరిష్కరించే వరకు బదిలీ చేయవద్దని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌తో తాను చెప్పానని కూడా అబ్బాస్​ చెప్పారని ఆరోపణలు ఉన్నాయి.

అబ్బాస్ అన్సారీ 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) టిక్కెట్‌పై పోటీ చేశారు. SBSP 2022 ఎన్నికల్లో SPతో కలిసి పోటీ చేసింది. అయితే ఈ కేసులో 2025 మార్చిలో సుప్రీంకోర్టు అబ్బాస్‌కు బెయిల్ మంజూరు చేసింది.