మోకా మోకా యాడ్: భారత్, పాక్ మ్యాచ్‌‌ కోసం బై వన్.. బ్రేక్ వన్ ఫ్రీ

మోకా మోకా యాడ్: భారత్, పాక్  మ్యాచ్‌‌ కోసం బై వన్.. బ్రేక్ వన్ ఫ్రీ

ఒకప్పటి సెన్సేనల్ మోకా మోకా‎ యాడ్‎ను స్టార్ స్పోర్ట్స్ మళ్లీ రీక్రియేట్ చేసింది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ కోసం కొత్త యాడ్ తీసుకొచ్చింది. టీ20 వరల్డ్ కప్‎లో భాగంగా ఈ నెల 24న పాకిస్తాన్‎తో భారత్ ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్స్‎లో భారత్-పాకిస్తాన్‎లు 5 సార్లు తలపడ్డాయి. కానీ పాకిస్తాన్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇక వీడియోలోకి వెళ్తే వరల్డ్ కప్‎లో పాకిస్తాన్ గెలవాలని ఆరాటపడే ఆ దేశ అభిమాని పటాకులు పట్టుకుని దుబాయ్ వెళ్తాడు. ఓ మాల్‎కు వెళ్లి అక్కడున్న లవ్లీ అనే సేల్స్ మెన్‎ని పెద్ద టీవీ చూపించమని అడుగుతాడు. ఫోన్ చూపిస్తూ.. ఈసారి తమ టీమ్‎లో బాబర్ ఆజమ్, రిజ్వాన్‎లు ఉన్నారని... వారు సిక్సర్లు కొడితే ఢిల్లీ అద్ధాలు పగులుతాయని కాన్ఫిడెంట్‎గా చెబుతాడు. అదే టైమ్‎లో సేల్స్ మెన్ రెండు టీవీలు చూపించి.. భారత్ చేతిలో పాకిస్తాన్ ఐదుసార్లు ఓడిపోయిన విషయం గుర్తు చేస్తాడు. ప్రతీసారి క్రాకర్స్ కాల్చలేకపోతున్నందున... కనీసం ఒక టీవీ కొంటే ఫ్రీగా వచ్చే మరో టీవీ అయినా పగలగొట్టాలని సలహా ఇస్తాడు. 

2015 వన్డే వరల్డ్ కప్ సమయంలో క్రాకర్స్ యాడ్‎తో స్టార్ స్పోర్ట్స్ పబ్లిసిటీ చేసింది. అప్పట్లో అది బంపర్ హిట్ అయింది. పాక్ అభిమాని తమ జట్టు భారత్ పై గెలవాలనే కోరికతో, గెలుస్తుందనే ఆశతో... క్రాకర్స్ తెచ్చుకోవడం, పాక్ ఓడిపోయాక... ఆక్రోశం పట్టలేకపోవడం... తర్వాత సౌతాఫ్రికా జెర్సీ వేసుకుని సౌతాఫ్రికా చేతులో అయినా ఇండియా ఓడిపోతుందేమోనని ఆశగా ఎదురు చూడడం... అందులోనూ భారతే గెలవడం లాంటి అప్డేట్స్‎తో అప్పట్లో యాడ్ క్రియేట్ చేసింది. యూఏఈ, ఐర్లాండ్, జింబాబ్వే, బంగ్లాదేశ్‎తో మ్యాచ్‎లప్పుడు కూడా... యాడ్‎లో చేంజెస్ చేస్తూ పోయింది. ఫ్యాన్స్, నెటిజన్స్ నుంచి సూపర్ అప్లాజ్ వచ్చింది. అదే టైమ్‎లో భారత అభిమానులు స్టార్ స్పోర్ట్స్ పై చిరాకును కూడా ప్రదర్శించారు. మోకా మోకాకి వ్యతిరేకంగా వేలల్లో స్పూఫ్‎లు వదిలారు. 

కాగా.. 2015 తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్స్‎లోనూ, 2019 వన్డే వరల్డ్ కప్ టైమ్‎లో కూడా  స్టార్ స్పోర్ట్స్ ఈ క్రాకర్స్ యాడ్ రిపీట్ చేయలేదు. దాంతో ప్రస్తుతం ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కోసం మోకా యాడ్‎ను రీక్రియేట్ చేసి.. విడుదల చేసింది. 

For More News..

మన్మోహన్ త్వరగా కోలుకోవాలంటూ మోడీ ట్వీట్

రూ.109కి చేరిన పెట్రోల్.. పెరిగిన కూరగాయల ధరలు

ప్లాస్టిక్ బ్యాగ్‌లో 9 ఏళ్ల బాలుడి మృతదేహం