మన్మోహన్ త్వరగా కోలుకోవాలంటూ మోడీ ట్వీట్

మన్మోహన్ త్వరగా కోలుకోవాలంటూ మోడీ ట్వీట్

ఢిల్లీ ఎయిమ్స్‎లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‎ను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ పరామర్శించారు. డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. జ్వరం, నీరసం కారణంగా మన్మోహన్ బుధవారం ఎయిమ్స్‎లో అడ్మిట్ అయ్యారు. ఆయనకు గతంలోనే బైపాస్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం మన్మోహన్‎కు కార్డియో న్యూరో యూనిట్‎లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మన్మోహన్ ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. 

మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మన్మోహన్ సింగ్ ఆరోగ్యంగా ఉండాలని... త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆయన ట్వీట్ చేశారు. 

మన్మోహన్ సింగ్‎కు ఛాతీ నొప్పి రావడం.. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఆలిండియా ఇన్‎స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో అడ్మిట్ చేశారు. మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఆరంభంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మొదలైనప్పుడు కరోనా బారిన పడ్డారు. అప్పుడు కూడా ఇదే ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స చేయించుకొని కోలుకున్నారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ నితీష్ నాయక్‌ నేతృత్వంలోని డాక్టర్ల బృందం మన్మోహన్ సింగ్‎కు చికిత్స అందిస్తోంది.

For More News..

బతుకమ్మను నిమజ్జనం చేయబోయి యువకుడు మృతి

రూ.109కి చేరిన పెట్రోల్.. పెరిగిన కూరగాయల ధరలు

ప్లాస్టిక్ బ్యాగ్‌లో 9 ఏళ్ల బాలుడి మృతదేహం