బతుకమ్మను నిమజ్జనం చేయబోయి యువకుడు మృతి

బతుకమ్మను నిమజ్జనం చేయబోయి యువకుడు మృతి

సంగారెడ్డి జిల్లాలో పండుగపూట విషాద ఘటన చోటుచేసుకుంది. పుల్కల్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో అపశృతి ఏర్పడింది. బతుకమ్మ ఆటపాటల తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తుండగా శేఖర్ అనే యువకుడు కాలు జారి చెరువులో పడిపోయాడు. గమనించిన స్థానికులు శేఖర్‎ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు లేకపోవడంతో సంగారెడ్డి హాస్పిటల్‎కు తీసుకెళ్తుండగా శేఖర్ మార్గమధ్యంలోనే చనిపోయాడు. పుల్కల్ ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శేఖర్ చనిపోయాడంటూ అతని బంధువులు, స్థానికులు ఆరోపించారు.

For More News..

రూ.109కి చేరిన పెట్రోల్.. పెరిగిన కూరగాయల ధరలు

ప్లాస్టిక్ బ్యాగ్‌లో 9 ఏళ్ల బాలుడి మృతదేహం

ఫెయిలైనా పాస్​ మార్కులు!