రూ.109కి చేరిన పెట్రోల్.. పెరిగిన కూరగాయల ధరలు

రూ.109కి చేరిన పెట్రోల్.. పెరిగిన కూరగాయల ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా వారం రోజులపాటు చమురు ధరలు పెంచిన కంపెనీలు.. రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ బాదుడు మొదలుపెట్టాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఈ రోజు లీటరు పెట్రోల్, డీజిల్ పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర 104 రూపాయల 79 పైసలకు చేరగా, డీజిల్ ధర 93 రూపాయల 52 పైసలకు చేరింది. ఇక ముంబైలో పెట్రోల్ పై 34 పైసలు పెరగడంతో 110 రూపాయల 75 పైసలకు చేరగా.. డీజిల్ ధర 101 రూపాయల 40 పైసలకు చేరింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో లీటరు పెట్రోల్ పై 36 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెరిగింది. దాంతో పెట్రోల్ ధర 109 రూపాయలకు చేరగా, డీజిల్ ధర 102 రూపాయల 4 పైసలకు చేరింది. గత 20 రోజుల్లో 15 రోజులు చమురు ధరలు పెరిగాయి. అక్టోబర్ 1న పెట్రోల్ ధర రూ. 106 ఉండగా.. అక్టోబర్ 14న రూ. 109కి చేరింది. అంటే కేవలం 14 రోజుల్లోనే రూ. 3 పెరిగింది.

కాగా.. చమురు ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు కూడా ఆకాశన్నంటుతున్నాయి. కూరగాయాల ధరలైతే విపరీతంగా పెరిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. వారం రోజుల కిందట టమాటో కిలో రూ. 30 ఉండగా.. ప్రస్తుతం కిలో రూ. 50 దాటింది. పచ్చిమిర్చి కేజీ 30 నుంచి 60కి పెరిగింది. మొన్నటి వరకు ఉల్లిగడ్డలు రూ.100కి 5కేజీలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం 3 కేజీలే ఇస్తున్నారు. అటు పెట్రోల్ రేట్లు, ఇటు కూరగాయాల ధరలు పెరగడంతో సామాన్యులు బతకడమెలా అని పెదవి విరుస్తున్నారు.

For More News..

ప్లాస్టిక్ బ్యాగ్‌లో 9 ఏళ్ల బాలుడి మృతదేహం

ఫెయిలైనా పాస్​ మార్కులు!

‘ మా నాన్నను ఇండియాకు రప్పించండి’