యూపీ అన్ని సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయొచ్చు:మాయావతి

యూపీ అన్ని సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయొచ్చు:మాయావతి

యూపీ : ఉత్తర్ ప్రదేశ్ మహాఘట్ బంధన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మహాకూటమిలోని పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ తాజా ప్రకటన.. ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు చిరాకు తెప్పిస్తోంది.

యూపీలో ఏడు సెగ్మెంట్లను మిత్రపక్షాలకు ఇస్తామని కాంగ్రెస్ ఇస్తున్న లీకులపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైరయ్యారు. కాంగ్రెస్ అవసరమైతే మొత్తం 80 ఎంపీ సీట్లలో పోటీచేయొచ్చని ఆమె అన్నారు. బీజేపీని ఓడించేందుకు ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ పార్టీల కూటమి సిద్ధంగా ఉన్నాయన్నారు. అంతేగానీ 7 సీట్లు ఎస్పీ, బీఎస్పీ , ఆర్ఎల్డీలకు ఇస్తున్నామంటూ చెడు సంకేతాలు పంపొద్దని ఆమె హితవు పలికారు.