ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్డీలో సీఎం క్యాంప్​ ఆఫీస్.!

ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్డీలో సీఎం క్యాంప్​ ఆఫీస్.!
  •     భవనాన్ని పరిశీలించిన రేవంత్‌‌‌‌రెడ్డి
  •     ఇయ్యాల నిర్ణయం తీసుకునే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌‌‌‌ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్‌‌‌‌డీ) ప్రాంగణంలోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రగతి భవనే సీఎం క్యాంపు కార్యాలయంగా కొనసాగగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి భవన్​ను జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌‌‌‌గా మార్చింది. ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నది. దీంతో సీఎం క్యాంపు కార్యాలయం మరోచోటికి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. అందుకు అనుగుణంగా ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్డీలో గుట్ట మీద ఉన్న బ్లాక్‌‌‌‌లోకి మార్చాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదివారం ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్డీకి వెళ్లి భవనాన్ని పరిశీలించారు.  సోమవారం ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్డీ, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై సీఎం క్యాంపు కార్యాలయం తరలింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

33 ఎకరాల విస్తీర్ణంలో ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్డీ 

ప్రస్తుతం రేవంత్‌‌‌‌రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసరాల్లో ఉన్నది. ఇప్పుడు అక్కడి నుంచే సెక్రటేరియెట్, ప్రజా భవన్​తో పాటు ఇతర ప్రాంతాలకు సీఎం వెళ్తున్నారు. రేవంత్ ఇంటికి, ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్డీకి చాలా తక్కువ దూరం ఉంది. దీంతో అక్కడే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది. సిటీలో అందుబాటులో ఉండేలా, సామాన్యులకు ఇబ్బంది లేకుండా.. ఈ ఏరియా సరిపోతుందని భావిస్తున్నారు. దాదాపు 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్డీ ప్రాంగణంలో ఒకేసారి దాదాపు 150 మంది చొప్పున కూర్చునే 4 కాన్ఫరెన్స్ హాళ్లు, పరిపాలక మండలి సమావేశం కావడానికి వీలుగా బోర్డ్ రూమ్, 250 మంది కూర్చునే ఆడిటోరియం, అతిథులకు ఆశ్రయం ఇవ్వడానికి మంజీర, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో విడివిడి బ్లాకులు ఉన్నాయి. ఇక్కడ సీఎం క్యాంపు ఆఫీస్​ ఏర్పాటైతే రెగ్యులర్‌‌‌‌గా జరిగే కాన్ఫరెన్స్‌‌‌‌లు, లెక్చర్లు, ట్రైనింగ్ తదితర యాక్టివిటీస్‌‌‌‌కు సెక్యూరిటీ కారణాలతో ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తున్నారు.

ఫ్యాకల్టీతో రేవంత్ ఇంటరాక్షన్

సీఎం రేవంత్ ఆదివారం ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్డీ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సంస్థ కార్యకలాపాల గురించి వాకబు చేశారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత సంస్థలోని వివిధ బ్లాకులను పరిశీలించారు. సీఎం వెంట పంచాయతీరాజ్ శాఖ మంత్రి  సీతక్క ఉన్నారు.