హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వాటర్బోర్డు నిర్మిస్తున్న పలు ఎస్టీపీలను ఎండీ సుదర్శన్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా నల్ల చెరువు దగ్గర నిర్మిస్తున్న ఎస్టీపీని సందర్శించిన ఆయన దాని పని తీరును పరిశీలించారు. నిర్వహణ పద్ధతుల్ని ఈడీ సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు ఎండీకి వివరించారు.
ఈ ఎస్టీపీ ఇటీవల ట్రయల్ పూర్తి చేసుకోగా.. ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. అనంతరం పెద్ద చెరువు ఎస్టీపీని ఆయన తనిఖీ చేశారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఎస్టీపీతో పాటు ఇప్పటికే ఉన్న మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని సైతం ఆయన పరిశీలించారు. ఔట్ లెట్ వద్ద చెరువులో కలుస్తున్న శుద్ధి చేసిన నీటి నాణ్యతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట సీజీఎం సుజాత, ఎస్టీపీ జీఎం, అధికారులు ఉన్నారు.
ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
వాటర్ బోర్డు ఇంజనీర్స్ అసోసియేషన్ (జేఈఏ) ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్ ను ఖైరతాబాద్ లోని వాటర్ బోర్డు హెడ్డాఫీసులో ఎండీ సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఈడీ ఎం. సత్యనారాయణ, డైరెక్టర్ ఆపరేషన్స్ అజ్మీరా కృష్ణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్ 2, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, జేఈఏ అధ్యక్షుడు రాజశేఖర్, జనరల్ సెక్రటరీ హరిశంకర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
