
ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: కుక్కలు, పందుల బెడదకు నివారణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ధరణీ రాజేశ్ కోరారు. గురువారం ఉట్నూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కుక్కలు, పందులు గుంపులుగుంపులుగా తిరుగుతున్నాయని, ఇంట్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయని తెలిపారు. మహిళలు, చిన్నారులు భయపడుతున్నారని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి బాబాశ్యామ్, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.