చరిత్రకు అడుగులు... వారసత్వానికి వెలుగులు..వేల్పుగొండలో ఘనంగా హెరిటేజ్ వాక్

చరిత్రకు అడుగులు... వారసత్వానికి వెలుగులు..వేల్పుగొండలో ఘనంగా హెరిటేజ్ వాక్

టేక్మాల్ వెలుగు:  చారిత్రక సంపదకు నిలయమైన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో ‘మెతుకుసీమ వైభవం’ ఆధ్వర్యంలో చరిత్రకారుడు బుర్ర సంతోష్ పర్యవేక్షణలో ఆదివారం ఘనంగా హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక బృందం కాకతీయుల కాలం నాటి చారిత్రక శ్రీ తుంబురీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, స్వయంభు శ్రీ లింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది.

ఆలయ నిర్మాణ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకున్న పర్యాటకులు, భావితరాలకు ఈ వారసత్వ సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలోని చారిత్రక ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరుడి దాసు, ఉప సర్పంచ్  సుధాకర్, సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు కొండల్ రెడ్డి, పర్యాటక బృందం సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.