మేడారం హుండీల లెక్కింపునకు 2 రోజుల విరామం

మేడారం హుండీల లెక్కింపునకు 2 రోజుల విరామం

హనుమకొండ: మేడారం జాతర హుండీల లెక్కింపునకు బ్రేక్ పడింది. గత ఆరు రోజులుగా టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం జాతర హుండీలు లెక్కింపు జరుగుతున్న విషయం తెలిసిందే. శివరాత్రి సందర్భంగా రెండ్రోజులు విరామం ఇచ్చారు. రేపు  తిరిగి లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు 450 హుండీలు కౌంటింగ్ పూర్తయ్యాయి. 6 రోజుల పాటు జరిగిన కౌంటింగ్ లో.. కరెన్సీ రూపంలో మొత్తం 10కోట్ల 63 వేల 980 రూపాయల ఆదాయం వచ్చింది. 
ఇంకా 47 హుండీలు,  బంగారం, వెండి ఆభరణాలతో పాటు విదేశీ కరెన్సీ, కాయిన్స్  లెక్కించాల్సింది ఉంది. లెక్కింపు తర్వాత పూర్తి వివరాలను రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ప్రకటిస్తారు. ఇప్పటి వరకు 6 రోజులపాటు జరిగిన హుండీల లెక్కింపు వివరాలు ఇలా ఉన్నాయి...

మొదటి రోజు కౌంటింగ్ : కోటి 34 లక్షల 60 వేలు.

రెండో రోజు కౌంటింగ్ : 2 కోట్ల 50 లక్షల 62 వేలు. 

మూడో రోజు  కౌంటింగ్: కోటి 53 లక్షల 37 వేల 100

నాలుగవ రోజు కౌంటింగ్: 2 కోట్ల 90 లక్షల 22 వేల 880

5వ రోజు కౌంటింగ్: 1 కోట్ల 50 లక్షల 15 వేలు

6వ రోజు కౌంటింగ్: కోటి 21 లక్షల 67 లక్షల రూపాయలు.

 

 

 

ఇవి కూడా చదవండి

పెండింగ్ చలాన్ల క్లియర్ కు విశేష స్పందన

ఈ యాప్ తో ర్యాగింగ్ ను అడ్డుకోవచ్చు

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్