మేడారం హుండీల లెక్కింపు.. ఐదు రోజుల్లో 11 కోట్ల 25 లక్షల 70వేలు

మేడారం హుండీల లెక్కింపు.. ఐదు రోజుల్లో 11 కోట్ల 25 లక్షల 70వేలు
  • తుది దశకు చేరుకున్న మేడారం హుండీల లెక్కింపు 
  • ఐదో రోజు కరెన్సీ కానుకలు రూ. 9లక్షల 67వేలు 
  • సోమవారం 76 హుండీలను లెక్కించిన అధికారులు 
  • మొత్తం హుండీలు 540.. ఇప్పటివరకు లెక్కించినవి  480

హనుమకొండ: మేడారం జాతర హుండీల లెక్కింపు ఐదో రోజు పూర్తియింది. సోమవారం (మార్చి 4) ఐదో రోజు లెక్కింపు లో భాగంగా 76 హుండీలను లెక్కించారు అధికారులు. ఐదోరోజు 9లక్షల 67 వేల ఆదాయం వచ్చింది.నగదును బ్యాంకులో డిపాజిట్ చేశారు దేవాదాయ శాఖ అధికారులు.
  
మేడారం జాతరలో రికార్డు స్థాయిలో భక్తుల నుంచి కానుకల రూపంలో ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు జరిగిన లెక్కింపులో 11 కోట్ల 25 లక్షల 70 వేల ఆదాయం వచ్చింది. మేడారం మహాజాతర హుండీల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. మహాజాతర కోసం ఏర్పాటు చేసిన 540 హుండీల్లో ఇప్పటివరకు 481 హుండీలు లెక్కించారు. లెక్కించేందుకు మరో 59 హుండీలు మాత్రమే ఉన్నాయి. మరో రెండు రోజుల్లో హుండీల లెక్కింపు పూర్తి కానుందని అధికారులు చెప్పారు.