కరీంనగర్ జిల్లాలో ముందస్తు బతుకమ్మ సంబురాలు

కరీంనగర్ జిల్లాలో ముందస్తు బతుకమ్మ సంబురాలు

కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన విద్యార్థులు,  టీచర్లు బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. దీంతో అన్ని విద్యాసంస్థల్లో సందడి నెలకొంది. జమ్మికుంట టౌన్‌‌‌‌‌‌‌‌లోని న్యూ మిలీనియం స్కూల్‌‌‌‌‌‌‌‌లో చైర్మన్ మూసిపట్ల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో, సిరిసిల్ల టౌన్‌‌‌‌‌‌‌‌లోని శ్రీకృష్ణవేణి టాలెంట్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌లో ప్రిన్సిపాల్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో, నారాయణ స్కూల్‌‌‌‌‌‌‌‌లో బతుకమ్మ సంబురాలు జరిపారు.

 గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో డైరెక్టర్​ మంజుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, కల్యాణ్‌‌‌‌‌‌‌‌నగర్​లోని శ్రీఆపిల్​ కిడ్స్​ స్కూల్‌‌‌‌‌‌‌‌లో ప్రిన్సిపాల్​ సునీత ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. - నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు