
మేడ్చల్, వెలుగు: లైంగిక దాడి కేసులో ఓ వ్యక్తికి మేడ్చల్ ఫాస్ట్ట్రాక్స్పెషల్ కోర్టు 20 ఏండ్ల జైలుశిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అడ్డాల నాని(28) బతుకుదెరువు కోసం అల్వాల్వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నాడు. తను ఉంటున్న గదికి సమీపంలోని ఓ బాలికతో సన్నిహితంగా మెలిగాడు.
2020 సెప్టెంబర్2న ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన అప్పటి సీఐ యాదగిరి కోర్టులో చార్జిషీట్వేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి గురువారం నానికి శిక్ష విధిస్తూ, బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు.