ఆర్మీ డాగ్‌ సోఫీకి ప్రధాని మోడీ మెచ్చుకోలు

ఆర్మీ డాగ్‌ సోఫీకి ప్రధాని మోడీ మెచ్చుకోలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మన్‌ కీ బాత్‌లో భాగంగా పలు విషయాలపై మాట్లాడారు. ఆయన సంభాషణలో సెక్యూరిటీ ఫోర్సెస్‌లో సేవలందిస్తున్న ఆర్మీలో సేవలు అందిస్తున్న కుక్కల ప్రస్తావన అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. బాంబు దాడుల ఆపరేషన్స్ నుంచి సాధారణ ప్రజలతోపాటు జవాన్ల ప్రాణాలను కాపాడటంలో ఈ కుక్కలు కీలక పాత్ర పోషించాయని మోడీ మెచ్చుకున్నారు. వీటిలో ఒకటైన సోఫీ అనే డాగ్‌ గురించి మోడీ మన్‌ కీ బాత్‌లో ప్రస్తావించారు. రీసెంట్‌గా దేశ రాజధాని ఢిల్లీలో విస్ఫోటక పేలుడు పదార్ధాలను కనుగొనే సీక్రెట్ ఆపరేషన్‌లో సోఫీ కీలకంగా వ్యవహరించిందని సమాచారం.

విదా అనే మరో డాగ్ కూడా క్రూషియల్ ఆపరేషన్స్‌లో కీ రోల్ పోషించిందని తెలుస్తోంది. ఈ డాగ్‌ ఇండిపెండెంట్స్ డే రోజున చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌ కమెండేషన్ నుంచి అవార్డును అందుకోవడం గమనార్హం. సోఫీ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ (ఎస్‌ఎఫ్‌ఎఫ్​)లో సేవలు అందిస్తోంది. బాంబులను కనుగొనే పలు సీక్రెట్ ఆపరేషన్స్ ఈ డాగ్ పని చేస్తుందని సమాచారం. విదా ఇండియన్ ఆర్మీ లోని నార్తర్న్ కమాండ్‌ యూనిట్‌లో సేవలు అందిస్తోంది. ఐదు గనులను విదా కనుగొందని తెలిసింది. అండర్‌‌గ్రౌండ్‌లో ఉన్న గ్రెనేడ్‌ను గుర్తించడం ద్వారా పలువురు జవాన్ల ప్రాణాలను కాపాడిందని ఓ ఆర్మీ అధికారి చెప్పారు. ఈ రెండు వీర డాగ్స్ గురించి మోడీ మన్‌ కీ బాత్‌లో ప్రముఖంగా మాట్లాడారు. ఆత్మనిర్భర్‌‌ అవసరం గురించి మాట్లాడిన మోడీ.. సెక్యూరిటీ ఫోర్సెస్‌లో స్వదేశీ బ్రీడ్ డాగ్స్ చాలా అద్భుతంగా పని చేస్తున్నాయని కొనియాడారు. గడిచిన ఒక్క ఏడాదిలో ఆర్మీ డాగ్స్ పలు ఆపరేషన్స్‌లో పాల్గొన్నాయి. దాదాపు 30 ఎల్‌ఈడీని గుర్తించడంతోపాటు టెర్రరిస్టులను పట్టించాయి. వీళ్లను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుపెట్టాయి.