తాలిబన్ లీడర్లను కలుస్తా

తాలిబన్ లీడర్లను కలుస్తా

వాషింగ్టన్: ‘టెర్రరిజంపై పోరులో భాగంగా అమెరికా సైనికులు సిరియా, ఇరాక్, అఫ్గాన్ లలో చాలాకాలంగా పోరాడుతున్నరు. అక్కడ ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను పూర్తిగా తుడిచిపెట్టేశారు. వేలాది మంది టెర్రరిస్టులను కాల్చేసి, అదే సంఖ్యలో ఖైదు చేశారు. 8 వేల మైళ్ల దూరం నుంచి జరుపుతున్న ఈ పోరాటానికి ఇక ముగింపు పలకాల్సిన టైమొచ్చింది. ఈ పోరును కొనసాగించేందుకు ఇంకెవరన్నా ముందుకు రావాలి. తాలిబన్లు ఈ పనిని చిత్తశుద్ధితో చేస్తారని నమ్ముతూ వారికి బాధ్యత అప్పగించి, మేం తప్పుకుంటున్నాం. తాలిబన్లు తమమీదున్న ఈ బాధ్యతను నిర్వహించడంలో విఫలమైనట్లు తెలిస్తే మేం తప్పకుం డా తిరిగొస్తాం’అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్​ ట్రంప్​ ఆదివారం పేర్కొన్నారు.

ఈ ప్రాసెస్ లో ఇరుగుపొరుగు దేశాలు తాలిబన్లకు సాయపడతాయని ఆశిస్తున్నట్లు ట్రంప్​ చెప్పా రు. తాలిబన్లతో శనివారం కుదిరిన శాంతి ఒప్పందం నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు. తాలిబన్ నేతలను త్వరలో పర్సనల్ గా కలుస్తానని ఆయన చెప్పా రు. టెర్రరిజాన్ని అణిచివేసేందుకు అఫ్గాన్ లో ఫైట్ చేస్తున్న అమెరికన్ సైనికులను వెనక్కి తీసుకురావాలని నిర్ణయించి నట్లు ట్రంప్​ చెప్పారు. తాలిబన్లతో కుదిరిన పీస్ డీల్ ప్రకారం.. వచ్చే 14 నెలల్లో అమెరికన్ బలగాలను అఫ్గాన్ భూభాగంపై నుంచి ఉపసంహరించుకుంటా మని వివరించారు. సుమారు 13 వేల మందికి పైగా అక్కడున్న అమెరికన్ హీరోలను ఇంటికి పిలిపించుకుంటామని అన్నారు. అఫ్గాన్ లో శాంతి నెలకొల్పేందుకే బలగాలను వెనక్కి తీసుకుంటున్ నామని, ఒప్పందా నికి విరుద్ధంగా అక్కడేదైనా జరిగితే రెట్టింపు వేగంతో తిరిగొస్తామని అన్నారు. అయితే అలా జరగదనే నమ్మకం తనకుందని ట్రంప్​ వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.