పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ : ఎస్పీ డాక్టర్ వినీత్

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ : ఎస్పీ డాక్టర్ వినీత్
  •     ఎస్పీ డాక్టర్ వినీత్ 

మహబూబ్ నగర్, వెలుగు:  జిల్లా పోలీస్ శాఖ మెగా క్రికెట్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం ఉదయం 9 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు నారాయణపేట  ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. 

ఈ టోర్నమెంట్‌‌‌‌లో జిల్లా పరిధిలోని 12 పోలీస్ స్టేషన్ల నుండి 24 యువకుల జట్లు, అదనంగా పోలీస్, మీడియా, రెవెన్యూ శాఖల ప్రత్యేక టీంలు పాల్గొంటాయన్నారు. ఈ మెగా క్రికెట్  టోర్నమెంట్​ ప్లేయర్లలో  క్రీడాస్ఫూర్తి , పోలీసు, ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుందని తెలిపారు.