బెల్లంపల్లిలో మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన

బెల్లంపల్లిలో మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన
  •     ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత

కోల్​బెల్ట్​/బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ గ్రౌండ్​లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ, నోబెల్​ ఎంపవర్​మెంట్ సొసైటీ సహకారంతో నిర్వహించిన  మెగాజాబ్​మేళాకు నిరుద్యోగుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఆదివారం జాబ్​మేళాను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ,కలెక్టర్​ కుమార్​దీపక్​, బెల్లంపల్లి సబ్​కలెక్టర్​ మనోజ్​,సింగరేణి డైరెక్టర్​(పీపీ) వెంకటేశ్వర్లు,డీసీపీ భాస్కర్​, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ ప్రారంభించారు.

ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. బెల్లంపల్లి పట్టణంలో తొలిసారిగా నిర్వహించిన మెగా జాబ్​మేళాకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. పలువురు చంటిపిల్లలను ఎత్తుకొని మేళాకు వచ్చారు.సింగరేణి సీఎండీ బలరాంనాయక్​,బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​ చొరవతో రాష్ట్రంలోని దాదాపు 70 ప్రముఖ కంపెనీలు జాబ్​మేళాలో పాల్గొన్నాయి. ఉద్యోగాల కోసం సుమారు 8,500 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్​ చేసుకోగా 4,812 మంది మేళాకు హాజరయ్యారు.2800 మందికి ఇంటార్వ్యూలు  నిర్వహించగా 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ 
నియామకపత్రాలు అందజేశారు.----