జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దైన తర్వాత జరిగే మొదటి లోక్ సభ ఎన్నికలు కావడంతో జమ్మూకాశ్మీర్, లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఎన్నికల ప్రభావం ఉంటుంది. అందులోనే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఒకే పార్లమెంట్ నియోజకర్గం నుంచి తలపడనున్నారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ మొహబూబా లోక్‌సభ ఎన్నికల్లో అనంత్‌నాగ్-రాజౌరీ నుంచి పోటీ చేయనున్నట్లు ఆదివారం ప్రకటించారు. కశ్మీర్ లోయలోని 3 సీట్లకు స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. పీడీపీ యువజన విభాగం అధ్యక్షుడు వహీద్ పర్రా శ్రీనగర్ సీటు నుంచి, రాజ్యసభ మాజీ సభ్యుడు మీర్ ఫయాజ్ బారాముల్లా నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
2022లో కాంగ్రెస్‌ను విడిచిపెట్టి తన సొంత రాజకీయ సంస్థ DPAPని స్థాపించిన గులాం నబీ ఆజాద్ కూడా అనంతనాగ్ నుంచే బరిలో ఉన్నారు. వీరితో ఇండియా బ్లాక్ అభ్యర్థిగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మియాన్ అల్తాఫ్ అహ్మద్‌తో పోటీ పడనున్నారు. దీంతో అక్కడ త్రిముఖ పోరు జరగనుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన జస్టిస్ (రిటైర్డ్) హస్నైన్ మసూది దాదాపు 10వేల ఓట్లతో అనంతనాగ్ లో ఎంపీగా గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి గులామ్ అహ్మద్ మీర్ 2వ, మెహబూబా ముఫ్తీ 3వ స్థానాల్లో నిలిచారు. ఉదంపూర్, జమ్మూలో కాంగ్రెస్ పార్టీకి పీడీపీ మద్దతు ఇస్తుందని మెహబూబా ముఫ్తీ, సర్తాజ్ మద్నీ మీడియా సమావేశంలో తెలిపారు.