చెన్నూరు కాంగ్రెస్లోకి చేరికల పర్వం :  వివేక్ సమక్షంలో పార్టీలోకి బీఆర్ఎస్ విమెన్ సెల్ లీడర్ 

చెన్నూరు కాంగ్రెస్లోకి చేరికల పర్వం :  వివేక్ సమక్షంలో పార్టీలోకి బీఆర్ఎస్ విమెన్ సెల్ లీడర్ 

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మందమర్రి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా జనరల్ సెక్రెటరీ మేకల ప్రమీల ఆ పార్టీకి రాజీనామా చేశారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి సమక్షంలో శుక్రవారం (నవంబర్ 24న) కాంగ్రెస్ లో చేరారు. ప్రమీలతో పాటు మరో 50 మంది కార్యకర్తలకు వివేక్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ప్రమీల మాట్లాడారు. 2016 నుంచి మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం జనరల్ సెక్రెటరీగా సేవలందించానని.. ఏనాడు కూడా ఎమ్మెల్యే బాల్క సుమన్ తన సేవలను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు.