
మేళ్లచెరువు, వెలుగు : మేళ్లచెరువులోని మై హోమ్ పరిశ్రమకు సున్నపురాయి గనుల నిర్వహణలో ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డు దక్కింది. ఉత్తమ నిర్వహణకు 2023–24 సంవత్సరానికి నేషనల్ లెవెల్ మైన్స్ ఫైన్ మేనేజ్మెంట్ ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు దక్కాయి. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఆధ్వర్యంలో రాజస్థాన్ లోని జైపూర్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ జూపల్లి రంజిత్ రావు, యూనిట్ హెడ్ శ్రీనివాసరావుకు ఈ ఫైవ్ స్టార్ అవార్డులను కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా సంస్థ యూనిట్ హెడ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిశ్రమకు చెందిన మేళ్లచెరువు, చౌటపల్లి , వేపలమాధవరంలో ని గనులకు ఒకేసారి ఫైవ్ స్టార్ట్ రేటింగ్ అవార్డు రావడం గొప్ప విషయమన్నారు. సంస్థ చేపట్టిన సస్టైనబుల్ డెవలప్ మెంట్, మినరల్ కన్జర్వేషన్, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొన్న చర్యలకు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కార్మికులను అభినందించారు. కార్యక్రమంలో మైన్స్ జనరల్ మేనేజర్ కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు.