
యూరప్ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ 'మేడ్ ఇన్ ఇండియా' ఈక్యూఎస్ 580 ‘4మ్యాటిక్’ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. జర్మనీ వెలుపల తొలిసారిగా ఈ లగ్జరీ ఈవీని ఇండియాలోనే తయారు చేశామని పేర్కొంది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఇది 580 కి.మీ ప్రయాణిస్తుంది. ధర రూ.1.55 కోట్లు. విదేశీ మోడల్‌తో పోలిస్తే దీని ధర రూ.90 లక్షలు తక్కువ కావడం గమనార్హం. ఇందులోని 107.8 కిలోవాట్ అవర్ బ్యాటరీ 532 హెచ్‌పీని ఇస్తుంది. 0-100 కి.మీ వేగాన్ని 4.3 సెకన్లలో అందుకుంటుంది.