‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీగో మారడోనా రికార్డు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన మెస్సీ

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీగో మారడోనా రికార్డు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన మెస్సీ

ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ నాకౌట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు రికార్డులతో హోరెత్తుతున్నాయి. గంటల వ్యవధిలో  ఓ లెజెండరీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌..మరో యంగ్‌‌‌‌‌‌‌‌ సెన్సేషన్‌‌‌‌‌‌‌‌ తమ ఆటతో ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు మస్తు కిక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఓవైపు అర్జెంటీనా లెజెండ్‌‌‌‌‌‌‌‌ లియోనల్‌‌‌‌‌‌‌‌ మెస్సీ తన 1000వ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో మ్యాజిక్ గోల్‌‌‌‌‌‌‌‌ చేస్తే..మరోవైపు ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ కిలియన్‌‌‌‌‌‌‌‌ ఎంబాపె డబుల్‌‌‌‌‌‌‌‌ ధమాకా మోగించాడు. ఈ ఇద్దరూ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్స్‌‌‌‌‌‌‌‌లో తొమ్మిది గోల్స్‌‌‌‌‌‌‌‌ చేసిన ప్లేయర్లుగా  డీగో మారడోనా, క్రిస్టియానో రొనాల్డోను అధిగమించారు. వీళ్ల  సూపర్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌తో అటు అర్జెంటీనా.. ఇటు డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌చాంప్‌‌‌‌‌‌‌‌ ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌  క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లాయి.

అల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రయాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 
ఎలాగైనా ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకొని తన కలవేర్చుకునే దిశగా అర్జెంటీనా లెజెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లియోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెస్సీ మరో అడుగు ముందుకేశాడు. మెగా టోర్నీలో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తూ.. ముచ్చటగా మూడో గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మురిపిస్తూ.. తమ దేశ లెజెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీగో మారడోనా రికార్డు బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ..  తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1000వ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీపి జ్ఞాపకంగా మార్చుకున్న మెస్సీ.. అర్జెంటీనాను క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేర్చాడు. శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో అర్జెంటీనా 2–1తో  ఆస్ట్రేలియాపై గెలిచింది. గత ఆరు టోర్నీల్లో అర్జెంటీనా క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరడం ఇది ఐదోసారి. క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ తో అర్జెంటీనా పోటీ పడనుంది.

లియోనల్​ జోరు

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోఅర్జెంటీనా దూకుడు చూపెట్టింది. బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా తమ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచుకొని వరసపెట్టి షాట్లు కొట్టింది. ఈ క్రమంలో 35వ నిమిషంలో మెస్సీ గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబట్టాడు. బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒటమెండి ఇచ్చిన పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బాటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి పంపాడు. వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెస్సీ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇదే తొలి గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. దాంతో, ఫస్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  అర్జెంటీనా 1–0తో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్ మొదలైన తర్వాత అర్జెంటీనా ఆధిక్యం డబులైంది. 57వ నిమిషంలో ప్రత్యర్థి గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బోల్తా కొట్టించిన  జులియన్ అల్వారెజ్ జట్టుకు సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించాడు. దాంతో, ఆస్ట్రేలియాపై  ప్రెజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగింది. 77వ నిమిషంలో ఆ జట్టుకు అనూహ్యంగా గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లభించింది. ఆసీస్ ఆటగాడు క్రెయిగ్ గుడ్ విన్ కొట్టిన షాట్ ప్రత్యర్థి ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంజో ఫెర్నాండెజ్ ముఖానికి తాకి ఆర్జెంటీనా గోల్ పోస్ట్ లో పడింది. దాంతో,  మెస్సీసేన సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా.. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1–2తో రేసులోకి వచ్చే ప్రయత్నం చేసింది.  కానీ, బలమైన డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆ జట్టుకు మరో చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వని అర్జెంటీనా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగించింది.