1000వ మ్యాచ్లో మెస్సీ అరుదైన రికార్డు

1000వ మ్యాచ్లో మెస్సీ అరుదైన రికార్డు


ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్లలో అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ సాధించిన రెండో ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు ఈ క్రమంలోనే మారడోనా రికార్డును మెస్సీ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మెస్సీ ఈ రికార్డును అందుకున్నాడు. మెస్సీకిది 1000వ మ్యాచ్ కావడం విశేషం. 

అద్భుతమైన ఫీట్..

ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ 2022లో రౌండ్‌ ఆఫ్‌ 16 లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఫస్టాఫ్లో  35వ నిమిషంలో బాటమ్‌ లెఫ్ట్‌ కార్నర్‌ నుంచి గోల్‌ కొట్టిన మెస్సీ..తాజా వరల్డ్‌కప్‌లో మూడో గోల్‌ సాధించాడు.  ఓవరాల్‌గా ఫిఫా వరల్డ్‌కప్స్‌లో 23వ మ్యాచ్‌ ఆడుతున్న మెస్సీకి ఇది 9వ గోల్‌. ఇదే సమయంలో ఫిఫా వరల్డ్‌కప్స్‌లో మారడోనా చేసిన 21 మ్యాచుల్లో 8 గోల్స్‌ రికార్డును మెస్సీ అధిగమించాడు. ఓవరాల్‌గా మెస్సీ ఇప్పటి వరకు 789 గోల్స్‌ చేశాడు.ఇక అర్జెంటీనా తరపున ఫిఫా వరల్డ్ కప్‌లలో అత్యధిక గోల్స్‌ చేసిన వారిలో గాబ్రియెల్‌ బటిస్టుటా 10 గోల్స్తో మొదటి స్థానంలో ఉన్నాడు. 

రొనాల్డో గొప్పనా..మెస్సీ గొప్పనా..

మరోవైపు పోర్చుగల్‌ ప్లేయర్  క్రిస్టియానో రొనాల్డో కంటే మెస్సీ మెరుగైన రికార్డులో నిలిచాడు. తన1000వ  ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను 2020లో ఆడిన రొనాల్డో... మొత్తంగా 725 గోల్స్ చేశాడు.  216 గోల్స్‌ చేసేందుకు సహకరించాడు. మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌లో 1000వ మ్యాచ్‌ను తాజాగా ఆస్ట్రేలియాపై ఆడాడు. ఇక తన కెరీర్‌లో789 గోల్స్‌ సాధించాడు. 348 గోల్స్‌కు సహకారం అందించాడు. రొనాల్డో ఖాతాలో 31 ట్రోఫీలు ఉండగా... మెస్సీ ఖాతాలో 41 ట్రోఫీలున్నాయి. రికార్డుల పరంగా చూస్తే..రొనాల్డో కంటే.. మెస్సీనే ఉత్తమ ఆటగాడు అనే చర్చ మొదలైంది.