చెత్త తీసేస్తున్నారు : ఫేస్ బుక్, ఇన్ స్టా నుంచి 2.6 కోట్ల కంటెంట్ పోస్టులు తొలగింపు

చెత్త తీసేస్తున్నారు : ఫేస్ బుక్, ఇన్ స్టా నుంచి 2.6 కోట్ల కంటెంట్ పోస్టులు తొలగింపు

ఫేస్ బుక్, ఇన్ స్టా నుంచి చెత్త కంటెంట్, సమస్యాత్మక కంటెంట్ తొలగించింది మెటా.. ఇది ఎంతో తెలుసా.. అక్షరాల 2 కోట్ల 60 వేల పోస్టుల కంటెంట్. ఇదంతా ఇండియా కంటెంట్. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా.. హింసను ప్రేరేపించేవిగా.. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేవిగా ఉన్నాయని.. అదే విధంగా 2021 ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయని.. అందుకే తొలగించినట్లు స్పష్టం చేసింది మెటా సంస్థ. 

ఫేస్ బుక్ నుంచి 2 కోట్ల పోస్టులు, ఇన్ స్టాగ్రామ్ నుంచి 60 లక్షల పోస్టుల కంటెంట్ తొలగించినట్లు వెల్లడించింది కంపెనీ. ఫేస్ బుక్ కు వచ్చిన 44 వేల కంప్లయింట్స్, ఇన్ స్టాకు వచ్చిన 19 వేల కంప్లయింట్స్ ఆధారంగా ఈ కంటెంట్ తొలగించటం జరిగిందని వివరించింది కంపెనీ. తొలగించిన 2 కోట్ల 60 లక్షల పోస్టుల కంటెంట్ లో టెక్ట్స్, ఫొటోలు, వీడియోలు, రీల్స్, కామెంట్లు, మీమ్స్ ఉన్నట్లు స్పష్టం చేసింది మీటా యాజమాన్యం. ఈ పోస్టుల తొలగింపుతో కొంత మందికి ఇబ్బంది కలుగుతుందని.. ఐటీ చట్టాలను గౌరవించి నడుచుకోవటం కంపెనీ బాధ్యతగా వెల్లడించింది మెటా. 19 వేల రిపోర్టుల్లో 9 వేల కేసులను పరిష్కరించామని.. 6 వేల కేసుల్లో చర్యలు తీసుకోవటం జరిగిందని రిపోర్ట్ విడుదల చేసింది మెటా. 

also read :- సైబర్‌ నేరాల బారిన ఎక్కువగా అలాంటి వారే పడుతున్నారు: హైదరాబాద్ సీపీ

2023లో నవంబర్ నెలలోనూ ఇలాంటి చర్యలే తీసుకున్నది ఫేస్ బుక్, ఇన్ స్టా.  అప్పుడు కోటి 80 లక్షల పోస్టుల కంటెంట్ తొలగించింది. ఇప్పుడు పెద్ద ఎత్తున.. భారీ స్థాయిలో ఏకంగా 2 కోట్ల 60 లక్షల పోస్టుల కంటెంట్ తొలగించటం ద్వారా.. ఫేక్ న్యూస్ కట్టడిపై సీరియస్ దృష్టి పెట్టినట్లు అయ్యింది. ఓవరాల్ గా మీరు పెట్టిన పోస్టు ఉందో లేదో ఓసారి చూసుకోండి.. ఉంటే పద్దతిగా ఉన్నట్లు.. పోస్టు కనిపించకపోతే మీరు నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెడుతున్నట్లే..