కంటెంట్ను తొలగిస్తున్న మెటా.. అసభ్యకర కంటెంట్ పెడితే ఇక అంతే

కంటెంట్ను తొలగిస్తున్న మెటా.. అసభ్యకర కంటెంట్ పెడితే ఇక అంతే

భారత్ లోని కొత్త ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా మెటా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని మార్పులను తీసుకొచ్చింది. ఫిబ్రవరి నెలలో ఫేస్ బుక్ కోసం 13 పాలసీలు, ఇన్ స్టాగ్రామ్ కోసం 12 పాలసీలను తీసుకొచ్చింది. ఈ క్రమంతో తదితర యాప్స్ లోని 28 మిలియన్లకు పైగా కంటెంట్‌ను మెటా తొలగించింది. 

వీటిలో ఎక్కువ శాతం యూజర్లు కంప్లైంట్ చేసినవే ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి అసభ్యకర కంటెంట్ విషయంలో 1,647 మంది యూజర్ల నుంచి కంప్లైంట్స్ వచ్చినట్లు మెటా తెలిపింది. వాటికి స్పందించి.. యాప్స్ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో 2021 నుంచి మెటా యూజర్లనుంచి 14,216 కంప్లైంట్స్ ను అందుకుంది.