V6 News

MECONలో 103 ఇంజినీర్ పోస్టులు: పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే ఉద్యోగం..

 MECONలో 103 ఇంజినీర్ పోస్టులు: పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే ఉద్యోగం..

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఈసీఓఎన్) ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభమై మే 11న ముగుస్తుంది.

మొత్తం ఖాళీలు: 103. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తి చేసి, పని అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 50 ఏళ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 27.

లాస్ట్ డేట్: మే 11.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ meconlimited.co.inను సందర్శించండి.