రష్యాపై ఆంక్షలు విధించబోం

రష్యాపై ఆంక్షలు విధించబోం

రష్యాపై ఆంక్షలు విధించే అంతర్జాతీయ దేశాల లిస్టులో తాము చేరడం లేదని మెక్సికో ప్రభుత్వం ప్రకటించింది. అన్ని దేశాలతోనూ శాంతియుతంగా ఉంచేందుకు యత్నిస్తున్నామని ఆదేశ అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఒబ్రాడోర్‌ తెలిపారు. అన్ని దేశాలతోనూ సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నామని, ఎలాంటి ఆర్థిక ప్రతీకార చర్యలను తీసుకోబోమన్నారు. తటస్థంగా ఉండటంతో.. విబేధాలు ఉన్నదేశాలతో చర్చలు జరిపేందుకు తమకు అవకాశం లభిస్తుందని అన్నారు. అంతేకాదు.. రష్యా ఏరోప్లాట్‌ విమానాల కోసం మెక్సికో సిటీ తమ దేశ గగనతలాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.

గతంలో వార్సా అగ్రిమెంట్ లో ఉన్న దేశాలైన బల్గేరియా, రొమేనియాలు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలన్నీ అమెరికాతో కలిసి రష్యాపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాయి. వాణిజ్య దేశమైన అమెరికాతో కాకుండా రష్యా, లాటిన్‌ అమెరికన్‌ మిత్రదేశాలతో ఆర్థిక సంబంధాలను కొనసాగించాలని మెక్సికో భావిస్తోంది. రష్యాకు చెందిన లుకోయిల్‌ ఈ ఏడాది మెక్సికోలోని అఫ్‌షోర్‌ ఆయిల్‌ ప్రాజెక్టును కొనుగోలు చేసింది. అయితే తటస్థత వైఖరితో అమెరికా-మెక్సికోల సన్నిహిత సంబంధాలపై ప్రభావం పడే అవకాశముంది.

మరిన్ని వార్తల కోసం..

చర్చలకు ముందు బాంబు దాడుల్ని నిలిపేయండి