
బిజినెస్‌డెస్క్, వెలుగు: డబ్బులను పొదుపు చేద్దామనుకునే వారికి ఒక ఆలోచన వస్తుంది. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేయాల్నా? లేదా రిస్క్ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ వచ్చే వాటిలో పెట్టల్నా? అని. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేసుకుంటే సేఫ్టీ ఎక్కువగా ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తారు. అదే మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్)లో పెడితే మార్కెట్ రిస్క్ ఉంటుందని అనుకుంటారు. నిజంగానే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ రిస్క్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లు పడితే మనం నష్టపోతాం. కానీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఎఫ్‌డీ చేస్తే ఆ డబ్బులను తీసుకొచ్చి కంపెనీలకు, ఇండివిడ్యువల్స్ లోన్లను ఇవ్వడానికి బ్యాంకులు వాడతాయి. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే, ఆ డబ్బులను తీసుకొచ్చి మార్కెట్లో షేర్లను కొనడానికి ఫండ్ మేనేజర్లు వాడతారు. రెండింటిలోనూ మన డబ్బులు బిజినెస్‌ల దగ్గరకే వెళతాయి. అందువలన రెండింటిలోనూ రిస్క్ ఉంటుందని గుర్తించాలి. కానీ, 10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేద్దామానుకుంటే ఏది బెటరో లెక్కించుకోవాలి. ఎఫ్‌డీ ఎందుకు తీసుకోవాలి? మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు పెట్టాలో? ఆలోచించాలి.
మ్యూచువల్ ఫండ్స్ ఎందుకంటే..
1) మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎఫ్‌డీలతో పోలిస్తే రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్‌ను ఎఫ్‌డీతో పోలిస్తే, ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను ఫండ్ మేనేజర్లు నిఫ్టీలోని టాప్ 25–50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. నిఫ్టీ 50 లో ప్రతీ సెక్టార్‌లోని టాప్ కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 113.5 లక్షల కోట్లుగా ఉంది. అంటే, దేశ జీడీపీలో వీటి వాటా 60 శాతంగా ఉంటుంది. అందువలన ఒకేసారి, ఈ కంపెనీలన్నీ దివాలా తీసే అవకాశం ఉండదు.
2) మార్కెట్‌లోని రిస్క్ బట్టి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. కానీ, పదేళ్ల టైమ్ పీరియడ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వలన నష్టాలొచ్చే అవకాశాలు లేవు. నిఫ్టీ 50 ఇప్పటి వరకు నెగెటివ్ రిటర్న్‌లను ఇవ్వలేదు. గత 20 ఏళ్లలో ఈ ఇండెక్స్ గరిష్టంగా 12.3 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ( సీఏజీఆర్) ఇచ్చింది. కనిష్టంగా 5.5 సీఏజీఆర్ (ప్రస్తుతం మార్కెట్లో ఇస్తున్న ఎఫ్‌డీకి సుమారుగా సమానం) ఇచ్చింది.
3) ఒక ఇన్వెస్టర్ రూ. లక్షను పదేళ్ల కోసం ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. ఎఫ్‌డీ చేస్తే పదేళ్లకు 6 శాతం వడ్డీ రేటు వద్ద రూ. 1.79 లక్షలు మాత్రమే వస్తాయి. అంటే రూ. 79 వేలు మాత్రమే రిటర్న్. అదే అమౌంట్‌ను లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ రేటు 13 శాతం వద్ద రూ. 3.40 లక్షల వస్తాయి. అంటే, రూ. 2.40 లక్షల రిటర్న్ వస్తుందన్న మాట. లార్జ్ క్యాప్ ఫండ్స్ గత ఐదేళ్లలో యావరేజ్‌గా 13 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. అందుకే ఈ రేటును పరిగణనలోకి తీసుకున్నాం.
ఎఫ్‌డీ ఎందుకంటే..
- బ్యాంక్ ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. బ్యాంకులు కేవలం బిజినెస్‌లకు మాత్రమే కాకుండా, రిటైల్ కస్టమర్లకు కూడా లోన్లిస్తాయి. మన డబ్బులను తీసుకెళ్లి పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ ఇవ్వడానికి బ్యాంకుల వాడతాయి. బ్యాంకులకు కస్టమర్లు కూడా లక్షల్లో ఉంటారు. అందువలన మన ఎఫ్‌డీ డబ్బులు నష్టపోతామనే ఆలోచన తక్కువగా ఉంటుంది. సేఫ్టీ ఉంటుందని చెప్పొచ్చు.
- మరోవైపు బ్యాంకు ఎఫ్‌డీలకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా బ్యాంకులు ప్రొవైడ్ చేస్తాయి. ఆర్‌బీఐకి చెందిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ప్రతీ ఎఫ్‌డీకి ఇన్సూరెన్స్ ఇస్తుంది. కానీ, ఒక ఎఫ్‌డీపై మ్యాక్సిమమ్ రూ. 5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్‌ను కవర్ చేస్తుంది. అంటే, బ్యాంకు ఏదైనా దివాలా తీస్తే, అందులో ఎఫ్‌డీలు పెట్టిన వారికి గరిష్టంగా రూ. 5 లక్షలను డీఐసీజీసీ ఇస్తుంది.