MGR ఏ పార్టీకి సొంతం కాదు: కమలహాసన్

MGR ఏ పార్టీకి సొంతం కాదు: కమలహాసన్

సినీ నటుడు,మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళనాట ఇప్పటికీ దివంగత MGR కు ఎనలేని అభిమానం ఉంది. అయితే.. రాజకీయంగా ఆయన కేవలం అన్నాడీఎంకేకే పరిమితం. ఎందుకంటే ఆ పార్టీని స్థాపించింది ఆయనే. ఈ క్రమంలోనే కమలహాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎంజీఆర్ అంటే ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్కరికో సొంతం కాదన్నారు కమల్. ఆయన ఉన్న డీఎంకేకి కానీ, ఆ తర్వాత ఆయన స్థాపించిన ఏఐఏడీఎంకేకి కానీ ఎంజీఆర్ సొంతం కాదని చెప్పారు.MGR అంటే మక్కల్ తిలగం అని కీర్తించారు. మొత్తం తమిళనాడుకు ఆయన సొంతమని చెప్పారు.

MGR మా సొంతం అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చెపుతారని… అలాంటప్పుడు అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే పార్టీ ఎంజీఆర్ తమకే సొంతమని ఎలా చెప్పుకోగలదని కమల్ ప్రశ్నించారు. ప్రజా నాయకుడిపై ఒక పార్టీ ముద్ర ఎలా వేయగలమన్నారు. తాను MGR అడుగుజాడల్లోనే పెరిగానని చెప్పారు. తమిళనాడులోని ఎంతో మంది మంత్రులు ఆయనను కనీసం చూడలేదన్నారు. 1980ల నాటి ఓ వీడియో క్లిప్ ను కమల్ చూపించారు. అందులో తనకు ఎంజీఆర్ శాలువా కప్పి, అవార్డు ఇచ్చి, ముద్దు పెట్టుకున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోను కమల్ తన ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు.