23 సంవత్సరాల తరువాత వాదనకు వచ్చిన మైఖేల్ జాక్సన్ కేసు

23 సంవత్సరాల తరువాత వాదనకు వచ్చిన మైఖేల్ జాక్సన్ కేసు

కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్(Michael Jackson) పై 2000 సంవత్సరంలో నమోదైన లైంగిక వేధింపుల కేసు వాదనకు వచ్చింది. దాదాపు 23 సంవత్సరాల క్రితం నమోదైన ఈ కేసుపై శుక్రవారం ఆగస్టు 18న కాలిఫోర్నియా అప్పీల్ కోర్టులో వాదను జరిగాయి. బిల్‌బోర్డ్ నివేదిక ప్రకారం.. ఈ కేసులో మైఖేల్ జాక్సన్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించే ఇద్దరు వ్యక్తులు జేమ్స్ సేఫ్‌చక్, వేడ్ రాబ్సన్మై లకు అనుగుణంగా వ్యాజ్యాలను కొనసాగించవచ్చని కాలిఫోర్నియా అప్పీల్ కోర్టు తీర్పును ఇచ్చింది.

దీనిపై జాక్సన్ తరుపు లేబుల్‌కు దిగువ కోర్టు మంజూరు చేసిన ఆమోదంతో వాదనలు జరిపాయి. మైఖేల్ జాక్సన్ తన కంపెనీల ఏకైక యజమాని.. కాబట్టి ఇద్దరు వ్యక్తులకు వాటిపై ఎలాంటి బాధ్యత, అధికారం లేదని కోర్టుకు విన్నవించారు. 
 
ఇక 2021లో కూడా ఈ కేసుపై వాదనలు జరగగా.. అప్పుడు కూడా లాస్ ఏంజిల్స్ కౌంటీ సుపీరియర్ కోర్ట్ న్యాయమూర్తి కూడా ఈ కేసును కొట్టివేస్తూ.. సేఫ్‌చక్, రాబ్సన్ లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కంపెనీకి లేదని తీర్పును ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఈ కేసుపై వాదనలు జరగగా.. అదే తీర్పును ప్రకటించింది కోర్టు.