టిక్ టాక్ తో మైక్రోసాప్ట్ డీల్  రద్దు

టిక్ టాక్ తో మైక్రోసాప్ట్ డీల్  రద్దు

గతేడాది ట్రంప్ హయాంలో టిక్ టాక్ ను మైక్రోసాఫ్ట్ దాదాపు దక్కించుకుంది అనుకున్నారు అంతా. అయితే చివరి నిమిషంలో ఆ డీల్ రద్దయిపోయింది. ఆ డీల్ విఫలమవడంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. తాను పనిచేసిన డీల్స్ లో అదే ఓ వింత డీల్ అని అన్నారు. కాలిఫోర్నియాలోని బివర్లీ హిల్స్ లో నిర్వహించిన కోడ్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

డీల్ కుదిరితే టిక్ టాక్ లో మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ, పిల్లల భద్రత, క్లౌడ్ నిపుణతను ప్రవేశపెట్టాలనుకున్నట్లు చెప్పారు సత్య నాదెళ్ల. చాలా మంది గురించి చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు. తాము టిక్ టాక్ దగ్గరకు పోలేదని.. వారే తమ దగ్గరకు వచ్చారని స్పష్టం చేశారు. సంస్థకు నాటి ప్రభుత్వం ప్రత్యేకించి కొన్ని విషయాలను స్పష్టం చేసిందని, దురదృష్టవశాత్తూ డీల్ కుదర్లేదని చెప్పారు.

మధ్యస్థంగా ఉండే అమెరికా విధి విధానాలు, చైల్డ్ సేఫ్టీ వంటి విషయాలే టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ సీఈవో ఝాంగ్ యిమింగ్ కు నచ్చాయన్నారు. అయితే..ఇప్పుడు జో బైడెన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఈ డీల్ కు సుముఖంగా ఉందో లేదో తనకు మాత్రం తెలియదన్నారు. ప్రస్తుతం తనకున్నదాంట్లో సంతృప్తిగా ఉన్నానని కామెంట్ చేశారు. క్రిప్టోకరెన్సీ నిబంధనలపై ప్రభుత్వ నియంత్రణకు మద్దతిస్తున్నానని చెప్పారు.

టిక్ టాక్ టేకోవర్ కు సంబంధించి గతేడాది ఆగస్టులో మైక్రోసాఫ్ట్ తో బైట్ డాన్స్ చర్చలను ప్రారంభించింది. అయితే, నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అడ్డుకున్నారు.