మిడ్జిల్ ఎంపీపీ రాజీనామా

మిడ్జిల్ ఎంపీపీ రాజీనామా

మిడ్జిల్ : మహబూబ్​నగర్ జిల్లా మిడ్జిల్ ఎంపీపీ కాంతమ్మ పదవికి రాజీనామా చేశారు. జెడ్పీసీఈవో జ్యోతిని కలిసి రాజీనామా పత్రం అందజేశారు. వెలుగొమ్ముల, కొత్తూరు, మల్లాపూర్ గ్రామాల కాంగ్రెస్​ అభ్యర్థిగా ఆమె గెలుపొందారు. 2019లో జరిగిన ఈ ఎన్నికల్లో మిడ్జిల్ మండలంలో మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలకుగాను నలుగురు బీఆర్ఎస్, నలుగురు కాంగ్రెస్, బీజేపీ నుంచి ఒక అభ్యర్థి గెలుపొందారు. బీజేపీ సపోర్ట్​తో కాంతమ్మ ఎంపీపీ పదవిని దక్కించుకున్నారు. ఎంపీపీగా ఎన్నికై ఏడాది తిరగకముందే మండలం అభివృద్ధి చెందాలనే సాకుతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్​ లో చేరారు. కొన్ని నెలల తర్వాత తనను భయభ్రాంతులకు గురిచేసి బీఆర్ఎస్​ పార్టీలోకి చేర్చుకున్నారని ఆరోపిస్తూ మళ్లీ కాంగ్రెస్​ లో చేరారు. ఇప్పుడు తాజాగా ఏడాది పదవి కాలం ఉండగానే ఎంపీపీ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె త్వరలో బీఆర్ఎస్​ లో చేరబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఓ కాంట్రాక్టు , డబుల్​ బెడ్రూం ఇల్లు కోసం ఆమె పదవిని అమ్ముకున్నారని కాంగ్రెస్​ ఆరోపిస్తోంది.